: అప్పుడు సీరియస్ గా తీసుకుంటే... ఉబెర్ పై ఇప్పుడీ నిషేధం తప్పేది!
ఉబెర్ క్యాబ్ డ్రైవర్ శివ కుమార్. కారులో ఎక్కించుకున్న యువతిపై అత్యాచారం చేసి ఇప్పుడు కటకటాలు లెక్కిస్తున్నాడు. ఈ ఘటనపై తీవ్రంగా స్పందించిన కేంద్రం ఉబెర్ పై నిషేధాన్ని విధించింది. ఘటనలో తమ తప్పు ఏమీ లేదని ఉబెర్ యాజమాన్యం గింజుకున్నా ప్రయోజనం లేకపోయింది. ఇప్పుడు తెలంగాణ సహా పలు రాష్ట్ర ప్రభుత్వాలు ఉబెర్ పై నిషేధం విధించాయి. ఉబెర్ యాజమాన్యం కాస్తంత జాగ్రత్తగా వుండి ఉంటే ఇప్పుడీ నిషేధం తప్పేది. అసలు విషయం ఏమంటే... క్యాబ్ డ్రైవర్ శివ కుమార్ పై వారం క్రితమే ఓ మహిళ ఫిర్యాదు చేసింది. కారులో ఉన్న తనపై అసభ్యంగా ప్రవర్తించబోయాడని ఉబెర్ కార్యాలయానికి ఆ మహిళ తెలిపింది. ఆ ఫిర్యాదును ఉబెర్ తేలికగా తీసుకుంది. అప్పుడు స్పందించి, శివ కుమార్ పై ఆరా తీసి ఉంటే, అతని గురించి నిజాలు తెలిసేవేమో! అప్పుడే డ్రైవర్ ను తొలగించి ఉంటే ఇప్పుడీ నిషేధం కూడా తప్పేది.