: కప్పట్రాళ్లలో తీవ్ర ఉద్రిక్తత... 144 సెక్షన్


పేరుమోసిన ఫ్యాక్షన్ గ్రామం కప్పట్రాళ్లలో తీవ్ర ఉద్రిక్తత నెలకొంది. తెలుగుదేశం పార్టీ నేత కప్పట్రాళ్ల వెంకటప్పనాయుడు హత్య కేసులో కర్నూలు జిల్లాలోని ఆదోని కోర్టు నేడు తుది తీర్పు వెలువరించనుంది. ఈ నేపథ్యంలో, ఆదోనితో పాటు కప్పట్రాళ్లలో భయాందోళనలు నెలకొన్నాయి. కోర్టు వద్ద నిషేధాజ్ఞలు విధించారు. కప్పట్రాళ్లలో 144 సెక్షన్ విధించడంతో పాటు, భారీ ఎత్తున పోలీసులు మోహరించారు. జిల్లా ఎస్పీ పరిస్థితిని మొత్తం సమీక్షిస్తున్నారు. అంతేకాకుండా, రెండు రోజుల పాటు కప్పట్రాళ్లలోనే బస చేశారు. 2008లో కప్పట్రాళ్ల వెంకటప్పనాయుడు బృందంపై బాంబులతో దాడి చేసిన ప్రత్యర్ధులు కత్తులతో పొడిచి మరీ హత్య చేశారు. ఈ దాడిలో వెంకటప్పనాయుడితో పాటు మరో 11 మంది హత్యకు గురయ్యారు. అప్పట్లో ఆ ఘటన తీవ్ర సంచలనం రేకెత్తించింది. ఈ కేసులో ప్రధాన నిందితుడిని ఇంత వరకు అరెస్ట్ చేయలేదు.

  • Loading...

More Telugu News