: మాజీ ప్రధాని అటల్ బిహారీ వాజ్ పేయికి భారతరత్న?
మాజీ ప్రధాని అటల్ బిహారీ వాజ్ పేయికి దేశ అత్యున్నత పురస్కారం భారతరత్న ఇవ్వాలనే అంశం మరోసారి తెరపైకి వచ్చింది. భారతరత్న పురస్కారాలపై చర్చ వచ్చిన ప్రతిసారీ వాజ్ పేయి పేరు ప్రతిపాదించాలని డిమాండ్ వస్తూనే ఉంది. దేశం గర్వించదగ్గ నేతల్లో వాజ్ పేయి ఒకరు. ఈ నెల 25న వాజ్ పేయి జన్మదినం. ఆ సందర్భంగా ఆయనకు దేశ అత్యున్నత పురస్కారం భారతరత్న అవార్డు ప్రకటించాలని కేంద్రం భావిస్తున్నట్టు సమాచారం. దేశకీర్తిని వాజ్ పేయి పెంచిన వ్యక్తి అని ఆర్ఎస్ఎస్ పలు సందర్భాల్లో వ్యాఖ్యానించింది. పీవీ చేపట్టిన సంస్కరణలను గాలికి వదిలేయకుండా, అధికారం చేపట్టిన తరువాత భాగస్వామ్యపక్షాలతో ఎలాంటి ఒడిదుడుకులు ఎదుర్కోకుండా, ఐదేళ్లు ప్రభుత్వాన్ని నడిపిన సమర్థవంతమైన నేత వాజ్ పేయి. దీంతో ఆయనకు భారతరత్న అందజేయాలని పలు సందర్భాల్లో పలువురు ప్రతిపాదించారు. ఇన్నాళ్టికి అది వాస్తవరూపం దాల్చుతోంది.