: కేసీఆర్ వర్సెస్ రమణ, ఎంఐఎం వర్సెస్ కాంగ్రెస్...అఖిలపక్షం సమావేశం


తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ హైదరాబాదులో నిర్వహించిన అఖిలపక్షం సమావేశంలో ఆసక్తికర వాగ్వాదాలు చోటుచేసుకున్నాయి. హైదరాబాదు అభివృద్ధిపై చర్చ జరిగిన సందర్భంగా ముఖ్యమంత్రి కేసీఆర్, తెలంగాణ టీడీపీ అధ్యక్షుడు రమణ మధ్య వాగ్వాదం చోటుచేసుకుంది. మెట్రోరైల్ పనులు ఎందుకు నత్తనడకన కొనసాగుతున్నాయని రమణ అడగడంపై కేసీఆర్ మండిపడ్డారు. భూకేటాయింపులు, అలైన్ మెంట్ మారుస్తున్నారంటూ ప్రజల్లోకి వెళ్లారంటూ ఆయన మండిపడ్డారు. ప్రభుత్వం చేసే పనులు పారదర్శకంగా నిర్వహించాలని అడగడం కూడా రాద్ధాంతమేనా? అని రమణ సీఎంను ప్రశ్నించారు. పాతబస్తీలో మెట్రోరైల్ అలైన్ మెంట్ మార్పుపై మజ్లిస్, కాంగ్రెస్ నేతల మధ్య వాగ్వాదం చోటు చేసుకుంది. నిర్దేశించిన మార్గంలోనే పాతబస్తీలో మెట్రోరైల్ నిర్మించాలని కాంగ్రెస్ నేతలు స్పష్టం చేశారు. దీనిపై ఎంఐఎం నేతలు మండిపడ్డారు. పాతబస్తీ గురించి మీకేం తెలుసంటూ ప్రశ్నించారు. దీంతో సమావేశంలో కాస్త గందరగోళం నెలకొంది.

  • Loading...

More Telugu News