: బాబు వీడియో కాన్ఫరెన్స్... కునుకు తీసిన అధికారి
ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు కలెక్టర్లు, మంత్రులు, రాజధాని ప్రాంత రైతులతో సీరియస్ గా వీడియో కాన్ఫెరెన్స్ నిర్వహిస్తుంటే, ఆయన వెనకే కూర్చున్న ఓ అధికారి హాయిగా కునుకు తీస్తూ కనిపించాడు. ఓ వైపు బాబు జన్మభూమి, గ్రామ సభలకు ఏర్పాట్లు వంటి విషయాలపై మాట్లాడుతుంటే, ఆయనకు మూడు సీట్ల వెనుక ఉన్న అధికారికి జోల పాడుతున్నట్టు ఉందేమో... హాయిగా నిద్రపోయాడు. అధికారి నిద్ర విషయం బాబుకు తెలిసిందో లేదో కాని కార్యక్రమాన్ని రికార్డ్ చేసిన కెమేరాకు మాత్రం తెలిసిపోయింది.