: సాకర్ ఆటగాడి బూటు రూ.19.41 కోట్లు పలికింది!


మామూలుగా సాకర్ ఆటగాళ్లు ధరించే బూట్ల ఖరీదు వేలల్లోనే ఉంటుంది. కానీ, ఈ బూటు ధర రూ.19.41 కోట్లు! ఆ బూటు... జర్మనీకి ఫిఫా వరల్డ్ కప్ సాధించిపెట్టిన మారియో గోట్జెది. అందుకే అంత ధర పలికింది. బ్రెజిల్ లో జరిగిన వరల్డ్ కప్ ఫైనల్లో జర్మనీ 1-0తో అర్జెంటీనాను చిత్తు చేసింది. ఆ టైటిల్ సమరంలో ఏకైక గోల్ చేసింది గోట్జెనే కావడం విశేషం. తనకందిన పాస్ ను ఎడమకాలితో లాఘవంగా గోల్ గా మలిచాడు. ఆ ఎడమకాలి బూటే ఇప్పుడు వేలంలో కోట్లు పలికింది. 24 ఏళ్ల తర్వాత జర్మనీ ప్రపంచవిజేతగా అవతరించేందుకు అవసరమైన గోల్ ను ఈ బూటుతో సాధించడంతో, అంత ధర వచ్చింది. పిల్లల కోసం పనిచేసే ఓ జర్మన్ ఛారిటీ సంస్థ నిధుల సేకరణ కోసం ఈ బూటును వేలం వేసింది. దీనిపై, గోట్జె మాట్లాడుతూ, ఓ సత్కార్యం కోసం బూటును వేలం వేయడం సంతోషంగా ఉందన్నాడు.

  • Loading...

More Telugu News