: రైళ్లలో మహిళల భద్రతకు ప్రత్యేక యాప్


రైళ్లలో మహిళల భద్రత కోసం భారతీయ రైల్వే శాఖ సాంకేతికతను ఉపయోగించుకుంటోంది. ఇందుకోసం ప్రత్యేక యాప్ ను రూపొందించబోతున్నట్టు కేంద్ర రైల్వే శాఖ మంత్రి సురేష్ ప్రభు తెలిపారు. త్వరలోనే ఈ యాప్ ను అందరికీ అందుబాటులోకి తీసుకురానున్నట్టు చెప్పారు. దీనిని భారత రైల్వే టెక్నికల్ విభాగం రూపొందిస్తోందని మంత్రి వెల్లడించారు. మహిళలు ఇబ్బందిలో ఉన్న సమయంలో ఈ యాప్ కలిగి ఉన్న ఫోన్ బటన్ నొక్కితే దగ్గరలోని స్టేషన్ మాస్టర్ కు సందేశం అందుతుందని... అలాగే, రైల్వే భద్రత సిబ్బంది, పోలీసులకు కూడా సమాచారం వస్తుందన్నారు. దానికి అనుగుణంగా వెంటనే చర్యలు తీసుకునే విధంగా ఏర్పాట్లు చేస్తున్నట్టు రైల్వే మంత్రి చెప్పారు. దాంతోపాటు, రైలు కంపార్ట్ మెంట్ లలో సీసీటీవీలు కూడా ఏర్పాటు చేస్తున్నామన్నారు.

  • Loading...

More Telugu News