: ఈ సాయంత్రం ఆన్ లైన్లో రుణమాఫీ రెండో జాబితా
రైతు రుణమాఫీకి సంబంధించి ఏపీ ప్రభుత్వం వేగంగా అడుగులు వేస్తోంది. ఇప్పటికే 43 లక్షల మంది రైతులతో తొలి జాబితా ప్రకటించిన చంద్రబాబు సర్కార్... ఈ సాయంత్రం రెండో జాబితా విడుదలకు సర్వ సిద్ధం చేసింది. సాయంత్రం 5 గంటల తర్వాత రెండో జాబితాను ఆన్ లైన్లో పొందుపరుస్తున్నట్టు ముఖ్యమంత్రికి ఐటీ అధికారులు తెలిపారు. వీడియో కాన్ఫరెన్స్ సందర్భంగా ఈ విషయాన్ని వెల్లడించారు. రెండో జాబితాలో మొత్తం 20 లక్షల 71 వేల మంది రైతులు ఉంటారని చెప్పారు.