: అమెరికాలో రోడ్డు ప్రమాదం... ఐదుగురు భారత విద్యార్థుల పరిస్థితి విషమం


అమెరికాలో జరిగిన ఓ రోడ్డు ప్రమాదంలో ఐదుగురు భారత విద్యార్థులు తీవ్రంగా గాయపడ్డారు. న్యూ ఆర్లియన్స్ లో ఓ థాంక్స్ గివింగ్ పార్టీలో పాల్గొని వస్తుండగా ఈ యాక్సిడెంట్ జరిగింది. వారు ప్రయాణిస్తున్న కారు ఓ ట్రక్ ను ఢీకొనడంతో ప్రమాదం సంభవించింది. కారులో ప్రయాణిస్తున్న ప్రణన్ కుమార్ (22), అక్షయ్ జైన్ (22), చిరంజీవి బోరే (23), శచిత్ అయ్యర్ (23), కిషన్ బజాజ్ (24) తీవ్ర గాయాలపాలయ్యారు. వారిని ఆసుపత్రికి తరలించారు. వారిలో ఇద్దరి పరిస్థితి మరీ విషమించడంతో ఎయిర్ అంబులెన్స్ ద్వారా హెర్మన్ మెమోరియల్ ఆసుపత్రికి తరలించారు. కాగా, గాయపడిన విద్యార్థుల వైద్య ఖర్చులు, వారి తల్లిదండ్రులను అమెరికా తీసుకువచ్చేందుకు అయ్యే ఖర్చుల నిమిత్తం అమెరికాలో భారత సంఘాలు నిధులు సేకరిస్తున్నాయి. ఈ విద్యార్థులంతా టెక్సాస్ లోని 'ఎ అండ్ ఎం' యూనివర్శిటీలో ఇంజనీరింగ్ విద్యను అభ్యసిస్తున్నారు.

  • Loading...

More Telugu News