: మెరుగైన జీవనం కోసమే హిందూ మతానికి మారాం: సుఫియా బేగం


మతం మనకు తిండి కూడా పెట్టలేదని, ఏ మతమైనా ఒకటే అన్న భావనతోనే హిందూ మతంలోకి మారానని సుఫియా బేగం (76) అన్నారు. ఆగ్రాలో జరిగిన ఓ కార్యక్రమంలో 200 మందికి పైగా ముస్లింలు హిందూ మతాన్ని స్వీకరించగా వారిలో అత్యధిక వయస్కురాలు సుఫియా బేగం. తనకు మెరుగైన జీవనాన్ని, తన మనవరాళ్ళకు మంచి విద్యనూ అందించేందుకు ఆర్ఎస్ఎస్ హామీ ఇచ్చిందని ఆమె అన్నారు. రోజుకు 5 సార్లు నమాజు చేసే తాను ఇకపై వినాయకుడికి హారతి పాటలు పాడుతానని అన్నారు. మొత్తం 57 కుటుంబాల వారు తిరిగి హిందూ మతంలోకి మారి తమతమ ఇళ్ళపై కాషాయ జండాలు ఎగురవేశారు. 'పూర్వోంకీ ఘర్ వాపసీ' (తిరిగి పూర్వీకుల ఇంటికి) పేరిట భజరంగ్ దళ్, ఆర్ఎస్ఎస్ అధ్వర్యంలో జరిగిన కార్యక్రమంలో వేద పండితుల మంత్రోచ్చారణ మధ్య నుదుటన విభూదితో దేవతా విగ్రహాలకు అభిషేకం చేయడం ద్వారా వీరు తమ మతాన్ని మార్చుకున్నారు. వీరందరికీ పేర్లు మార్చి, కొత్త పేర్లతో ఆధార్ కార్డులు, ఓటర్ ఐడీలు, రేషన్ కార్డులు ఇప్పిస్తామని ఆర్ఎస్ఎస్ నేత ఒకరు తెలిపారు.

  • Loading...

More Telugu News