: మోదీ అర్ధాంగి జశోదాబెన్ ను లక్ష్మణుడి భార్యతో పోల్చిన పార్లమెంటు సభ్యుడు


ఉత్తరప్రదేశ్ లోని 'ఉన్నావ్' పార్లమెంటు సభ్యుడు సాక్షి మహరాజ్ ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికల సభలో ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. ఈ సందర్భంగా ఆయన ప్రధాని నరేంద్ర మోదీ భార్య జశోదాబెన్ ను లక్ష్మణుడి భార్య ఊర్మిళతో పోల్చారు. సార్వత్రిక ఎన్నికల్లో మోదీ ఘనవిజయానికి కారణం జశోదాబెన్ అని సూత్రీకరించారు. ఆర్కేపురంలో నిర్వహించిన ఈ సభలో ఆయన మాట్లాడుతూ, రాముడితో పాటు లక్ష్మణుడు కూడా వనవాసం వెళ్లాడని, అయితే, ఆ సమయంలో లక్ష్మణుడి భార్య వనవాసం వెళ్లకుండా తపస్సులో మునిగిపోయిందని తెలిపారు. ఆమె తపస్సే లక్ష్మణుడికి శక్తినిచ్చిందని, తద్వారా యుద్ధంలో వీరోచితంగా పోరాడగలిగాడని సాక్షి మహరాజ్ వివరించారు. అలాగే, మోదీ విజయం వెనుక జశోదాబెన్ ఉన్నారని పేర్కొన్నారు. ఢిల్లీ అభివృద్ధి బాధ్యతలు మోదీ స్వీకరిస్తారని, దేశాన్ని ఎలా నడిపిస్తున్నారో, అలాగే ఢిల్లీని కూడా పురోగామి పథంలో తీసుకెళతారని ఆయన చెప్పారు. మహరాజ్ ఇంతకుముందోసారి తీవ్ర వ్యాఖ్యలు చేశారు. మదర్సాలు ఉగ్రవాదానికి, జిహాదీలకు పుట్టిళ్లని పేర్కొన్నారు.

  • Loading...

More Telugu News