: ఈ రోజు మరో మూడు కుటుంబాలను పరామర్శించనున్న షర్మిల
వైకాపా అధినేత జగన్ సోదరి షర్మిల చేపట్టిన పరామర్శ యాత్ర రెండో రోజుకు చేరుకుంది. మహబూబ్ నగర్ జిల్లాలో ఆమె యాత్ర కొనసాగుతోంది. ఈ యాత్రలో మాజీ ముఖ్యమంత్రి వైయస్ మరణాన్ని తట్టుకోలేక అసువులు బాసిన వారి కుటుంబాలను షర్మిల పరామర్శిస్తోంది. నిన్న మూడు కుటుంబాలను పరామర్శించిన షర్మిల... నేడు మరో మూడు కుటుంబాలను పరామర్శించనుంది. ఈ ఉదయం జిల్లాలోని కల్వకుర్తి నుంచి ఆమె పర్యటన మొదలైంది. అమ్రాబాద్ లోని రంగయ్య కుటుంబాన్ని, ఎత్తం గ్రామంలోని నర్సింగ్ కుటుంబాన్ని, కొల్లాపూర్ లోని రామచంద్రయ్య కుటుంబాన్ని ఆమె పరామర్శిస్తారు.