: ఈసారి భజనలతో సరిపెట్టిన కేంద్ర మంత్రి సాధ్వి


వివాదాస్పద వ్యాఖ్యలు చేసి దాదాపు వారం రోజులకు పైగా పార్లమెంట్ స్తంభించి పోవడానికి కారణమైన కేంద్ర మంత్రి సాధ్వి నిరంజన్ జ్యోతి ఈసారి మాత్రం నోటికి పెద్దగా పని చెప్పలేదు. ఢిల్లీలో ఎన్నికల ప్రచారంలో భాగంగా రెండు ర్యాలీల్లో పాల్గొన్న సాధ్వి కేవలం భజనలకు మాత్రమే పరిమితం అయ్యారు. తూర్పు ఢిల్లీలోని త్రిలోకపురి ప్రాంతంలో ఇటీవల మత ఘర్షణలు తలెత్తిన ప్రాంతంలో ఆమె ర్యాలీ జరగడంతో పోలీసులు సైతం పెద్దఎత్తున మోహరించారు. సభా వేదికను సైతం మార్చుకోవాలని పోలీసులు సూచించగా, అందుకు ప్రతిఘటించకుండానే అదే ప్రాంతంలోని పబ్లిక్ పార్క్ కు వేదికను మార్చారు. వచ్చే అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్, ఆమ్ ఆద్మీ పార్టీలను ఓడించాలని ఆమె పిలుపునిచ్చారు.

  • Loading...

More Telugu News