: రుణమాఫీ పూర్తైంది... విమర్శలు మానండి: విపక్షాలకు జేసీ సూచన


ఆంధ్రప్రదేశ్ లో రైతుల రుణాల మాఫీ పూర్తైందని అనంతపురం ఎంపీ జేసీ దివాకర్ రెడ్డి అన్నారు. రుణమాఫీ పూర్తైన నేపథ్యంలో ఆ విషయంపై విమర్శలు చేయడాన్ని మానుకోవాలని ఆయన ప్రతిపక్షాలకు సూచించారు. సోమవారం అనంతపురంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో మాట్లాడిన ఆయన ఎన్నికల్లో తామిచ్చిన హామీ మేరకు రుణమాఫీని అమలు చేశామని తెలిపారు. ఇందులో పెద్ద రైతులకు కాస్త అన్యాయం జరిగి ఉండొచ్చని, అంతమాత్రాన మొత్తం రుణమాఫీపైనే విమర్శలు గుప్పించడం సబబు కాదని ఆయన అభిప్రాయపడ్డారు.

  • Loading...

More Telugu News