: ప్రాణహితకు జాతీయ హోదా ఇస్తాం: కేసీఆర్ కు ఉమా భారతి హామీ


ప్రాణహిత-చేవెళ్ల ప్రాజెక్టుకు జాతీయ హోదా కల్పిస్తామని కేంద్ర జలవనరుల శాఖ మంత్రి ఉమా భారతి స్పష్టం చేశారు. సోమవారం తనను కలిసిన తెలంగాణ సీఎం కేసీఆర్ చేసిన విజ్ఞప్తికి సానుకూలంగా స్పందించిన ఆమె ప్రాణహితకు జాతీయ హోదాతో పాటు దేవాదుల ప్రాజెక్టుకు రూ.64 కోట్లను విడుదల చేస్తామని వెల్లడించారు. ప్రధాని నరేంద్ర మోదీ నేతృత్వంలో జరిగిన సీఎంల సదస్సులో పాల్గొనే నిమిత్తం ఢిల్లీ వెళ్లిన కేసీఆర్, సోమవారం ఉమా భారతితో భేటీ అయ్యారు. ఈ సందర్భంగా కేసీఆర్ కు సాదర ఆహ్వానం పలికిన ఉమా భారతి, తెలంగాణకు బాసటగా నిలుస్తామని ప్రకటించారు. తెలంగాణ ఉద్యమానికి అండగా నిలిచిన తాము రాష్ట్రాభివృద్ధిలోనూ పాలుపంచుకుంటామని ఆమె వెల్లడించారు.

  • Loading...

More Telugu News