: జన్మదిన వేడుకలకు సోనియా దూరం


జన్మదిన వేడుకలకు దూరంగా ఉండాలని కాంగ్రెస్ అధినేత్రి సోనియా గాంధీ నిర్ణయించారు. ఛత్తీస్ గఢ్, జమ్మూకాశ్మీర్ లలో జవాన్లపై ఉగ్రవాదులు దాడులు జరపడంతో సోనియా గాంధీ తన పుట్టిన రోజు వేడుకలు చేసుకునేందుకు విముఖత చూపుతున్నారు. దీంతో ఆమె జన్మదిన వేడుకలు జరుపుకోకూడదని నిర్ణయించారు. దీనిపై కాంగ్రెస్ పార్టీ ఓ ప్రకటన జారీ చేసింది. ప్రతి ఏటా సోనియా గాంధీ జన్మదిన వేడుకల సందర్భంగా పార్టీకి చెందిన ముఖ్యనేతలు 10 జనపథ్ లోని ఆమె నివాసంలో ఆమెకు శుభాకాంక్షలు తెలపడం ఆనవాయతీ.

  • Loading...

More Telugu News