: రజనీకాంత్ ను చూసి ఎంతో నేర్చుకోవాలి...నా రెండు కోరికలు తీరాయి: కళాతపస్వి విశ్వనాథ్
రజనీకాంత్ ను చూసి వర్థమాన నటీనటులు ఎంతో నేర్చుకోవాలని కళాతపస్వి విశ్వనాథ్ తెలిపారు. హైదరాబాదులోని నోవాటెల్ హోటల్ లో లింగా ఆడియో వేడుకలో ఆయన మాట్లాడుతూ, తన జీవితంలో రెండు కోరికలు తీరకుండా మిగిలిపోయాయని అన్నారు. రజనీకాంత్ తో సినిమా చేయాలి అనేది ఒకటైతే, రెండోది బాలచందర్ గారితో ఓ సినిమాలో నటించాలని ఆయన చెప్పారు. తన కోరికల్లో ఒకటి త్వరలో తీరనుందని, రెండోది ఈ ఆడియో ఫంక్షన్ లో పాల్గోవడం ద్వారా తీరిందని ఆయన అన్నారు.