: బాబుతో సింగపూర్ వాణిజ్య మంత్రి ఈశ్వరన్ భేటీ
ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడుతో సింగపూర్ వాణిజ్య శాఖ మంత్రి ఈశ్వరన్ సమావేశమయ్యారు. ఏపీ సచివాలయంలో జరుగుతున్న ఈ భేటీలో రాజధాని నిర్మాణానికి అవసరమైన బృహత్తర ప్రణాళిక రూపకల్పన, ఇతరత్రా సాంకేతిక సహకారంపై ఇద్దరూ చర్చిస్తున్నారు. సమావేశం సందర్భంగా రాజధాని నిర్మాణం, డెవలప్ మెంట్ పై ఒప్పందం కూడా కుదుర్చుకోనున్నారు.