: దాసరిని వెంటాడుతున్న బొగ్గు స్కాం... ప్రశ్నించిన ఈడీ


టాలీవుడ్ దర్శక దిగ్గజం, కేంద్ర మాజీ మంత్రి దాసరి నారాయణరావును బొగ్గు స్కాం వెంటాడుతోంది. తాజాగా, ఆయనను ఎన్ ఫోర్స్ మెంట్ డైరక్టరేట్ ప్రశ్నించింది. యూపీఏ-1 హయాంలో దాసరి బొగ్గు శాఖ సహాయ మంత్రిగా వ్యవహరించిన కాలంలోనే ఈ క్షేత్రాల కేటాయింపులు జరిగాయి. దీంతో, ఆయన కూడా ఈడీ వేడిని భరించాల్సి వస్తోంది! అప్పట్లో దాసరి పేరును ఎఫ్ఐఆర్ లో చేర్చిన సీబీఐ, ఆయన నివాసంలో సోదాలు కూడా నిర్వహించింది. కాగా, ఈ కుంభకోణంలో సీబీఐ దర్యాప్తు పరంగా బాగా వెనకబడిందని సుప్రీం పేర్కొంది. వచ్చే ఏడాది ఫిబ్రవరి 5లోగా కేసుకు సంబంధించిన నివేదికను తమకు సమర్పించాలని ఆదేశించింది. 2006-2009 మధ్యకాలంలో బొగ్గు మంత్రిత్వ శాఖను ప్రధాని మన్మోహన్ సింగ్ పర్యవేక్షించారు. దాసరి ఆ సమయంలో సహాయమంత్రిగా వ్యవహరించారు. ఆ సమయంలో ప్రైవేటు సంస్థలకు ఇబ్బడిముబ్బడిగా బొగ్గు క్షేత్రాలు కేటాయించారని కాగ్ ఎత్తిచూపింది. ఎన్నో కంపెనీలు కారుచౌకగా ఈ బొగ్గు క్షేత్రాలను దక్కించుకున్నాయని కాగ్ తెలిపింది. ఆ సమయంలో బొగ్గు క్షేత్రాల్లో 90 శాతం నిల్వలు ఉండగా, మార్కెట్ విలువ ప్రకారం సర్కారుకు రూ.86 వేల కోట్ల మేర నష్టం వాటిల్లినట్టు కాగ్ వివరించింది. దీంతో, విపక్షాలు దుమ్మెత్తిపోయడంతో మన్మోహన్ సర్కారు సీబీఐ విచారణకు ఆదేశించింది.

  • Loading...

More Telugu News