: జానకీరామ్ తో పాటే నేను కూడా చచ్చిపోయి వుంటే బాగుండేది: ట్రాక్టర్ డ్రైవర్ యలమంచి వెంకన్న
నందమూరి జానకీరామ్ మృతికి కారణమైన ట్రాక్టర్ డ్రైవర్ యలమంచి వెంకన్న పశ్చాత్తాపంతో కుమిలిపోతున్నాడు. నల్గొండ జిల్లా మునగాల మండలం ఆకుపాముల వద్ద ట్రాక్టర్ తో అడ్డం వచ్చి, జానకీరామ్ యాక్సిడెంట్ కు కారణమైన వెంకన్న ఓ టీవీ ఛానెల్ తో మాట్లాడుతూ, తాను కూడా ఆ రోడ్డు ప్రమాదంలో మృతి చెంది ఉంటే ఎంతో బాగుండేదని అన్నాడు. తాను ఎన్టీఆర్ అభిమానినని, టీడీపీ కార్యకర్తనని వెంకన్న తెలిపాడు. జానకీరామ్ యాక్సిడెంట్ లో మృతి చెందడం తనను ఎంతో వేదనకు గురి చేసిందని వెంకన్న తెలిపాడు.