: దూసుకుపోతున్న తెలంగాణ: ఉమాభారతి కితాబు
అభివృద్ధి పథంలో తెలంగాణ రాష్ట్రం శరవేగంగా దూసుకుపోతోందని కేంద్ర జలవనరుల శాఖ మంత్రి ఉమాభారతి అన్నారు. తెలంగాణ సీఎం కేసీఆర్‌తో భేటీ అనంతరం ఆమె విలేకరులతో మాట్లాడుతూ, తెలంగాణ అభివృద్ధికి కేంద్రం నుంచి పూర్తి సహకారం అందుతుందని అన్నారు. మిషన్ కాకతీయ, ప్రాణహిత-చేవెళ్ల, దేవాదులపై చర్చించామని, చర్చకు వచ్చిన అంశాలపై సానుకూల దృష్టితో ఉన్నామని ఉమాభారతి చెప్పారు. కాగా, అంతకుముందు, దేశంలోని నదుల ప్రక్షాళన కోసం పలు రాష్ట్రాలకు కేంద్ర ప్రభుత్వం రూ.5,160 కోట్లు మంజూరు చేసిందని రాజ్యసభలో ఉమాభారతి ప్రకటించారు.