: అవినీతి కేసులో అరెస్టయిన నోయిడా ఇంజనీర్ పై సస్పెన్షన్ వేటు


యూపీలోని నోయిడా ఇంజనీర్ ఇన్ చీఫ్ యాదవ్ సింగ్ ను ఉత్తరప్రదేశ్ ప్రభుత్వం సస్పెండ్ చేసింది. ముఖ్యమంత్రి అఖిలేశ్ యాదవ్ ఆదేశాల మేరకు ఉన్నతాధికారులు ఆయనను పదవి నుంచి తొలగించారు. అంతేగాక, ఆయనపై శాఖాపరమైన విచారణ కూడా చేపట్టాలని ఆదేశించారు. ఇటీవల ఢిల్లీ, నోయిడా, ఘజియాబాదుల్లో యాదవ్ కు చెందిన నివాసాలు, కార్యాలయాల్లో ఆదాయపన్ను శాఖ తనిఖీలు నిర్వహించింది. ఈ సందర్భంగా భారీగా నగదు, రూ.వంద కోట్ల విలువైన వజ్రాలను స్వాధీనం చేసుకుంది. అంతేగాక, నివాసంలోని ఆడీ కార్లో ఎనిమిది సంచుల్లో నింపి ఉన్న నగదును చూసి అధికారులు నివ్వెరపోయారు. ప్రభుత్వ ఉద్యోగం చేసే ఓ ఇంజినీర్ కు ఇంత సంపద ఎక్కడ నుంచి వచ్చిందనే దానిపై దర్యాప్తు చేస్తున్నారు.

  • Loading...

More Telugu News