: నాతో పాటు వ్యాపారవేత్తలు ఉన్నారని నిరూపించగలరా?: శ్వేతా బసు ప్రసాద్ సూటి ప్రశ్న


"వ్యభిచార ఆరోపణలతో నన్ను పోలీసులు అరెస్ట్ చేసినప్పుడు నాతో పాటు గదిలో కొందరు వ్యాపారవేత్తలు ఉన్నారని నిరూపించగలరా?" అని ప్రశ్నిస్తోంది నటి శ్వేతా బసు ప్రసాద్. గతవారం కోర్టు శ్వేతాపై ఉన్న అభియోగాలను కొట్టేసిన సంగతి తెలిసిందే. ఆ రోజు తాను 'సంతోషం' అవార్డుల కార్యక్రమం కోసం హైదరాబాద్ వచ్చానని శ్వేతా మరోసారి స్పష్టం చేశారు. "ఆర్థిక ఇబ్బందుల నేపథ్యంలో వ్యభిచారం చేయాల్సి వచ్చింది" అని నా పేరిట ఎవరో తప్పుడు ప్రకటన మీడియాకు అందించారని ఆమె ఆరోపించారు. అసలు సమస్య అంతా సమాజంలోనే ఉందని అంటూ, తనపై జాలి చూపిన వారే, ఆ తప్పుడు ప్రకటన తరువాత తాను నిజాలు దాస్తున్నట్టు భావించారని శ్వేతా అన్నారు. "హైదరాబాద్ పోలీసులు చెబుతున్నట్టు నా జీవితంలోకి ప్రవేశించిన ఆ వ్యాపారవేత్తలు ఎవరు? వాళ్లు ఎవరో నాకూ తెలుసుకోవాలని ఉంది. మీలాగానే నేనూ ఈ విషయంలో ఆత్రుతతో ఉన్నాను. నాతో పాటు పోలీసులకు పట్టుబడ్డ ఆ వ్యాపారవేత్తల పేర్లు కూడా ఎందుకు బయటకు రాలేదు? ఆలోచించండి... నిరూపించండి?" అని ఆమె ప్రశ్నలు సంధించారు.

  • Loading...

More Telugu News