: తెలుగు దేశం పార్టీ పటిష్ఠంగానే వుంది: మురళీ మోహన్


రాష్ట్రంలో తెలంగాణవాదం పెరిగాక ఆ ప్రభావం పలువురు టీడీపీ నేతలపై పడింది. పార్టీలో తెలంగాణపై సరైన నిర్ణయం వెలువడకపోవడంతో,  కొందరు పార్టీని వీడారు. ఇప్పటికీ పార్టీలో ఆ ప్రభావం స్పష్టంగా కనిపిస్తోంది. ఈ నేపథ్యంలో రాజమండ్రిలో ఓ కార్యక్రమంలో మాట్లాడిన టీడీపీ రాష్ట్ర నాయకుడు, సినీనటుడు మురళీమోహన్, 'పార్టీని వీడి వెళ్లే జంప్ జిలానీల వల్ల కలిగే నష్టమేమి లేద'ని అన్నారు. రాష్ట్రంలో పార్టీ పటిష్ఠంగానే ఉందన్నారు. 2014 ఎన్నికల్లో తెలుగుదేశం మెజార్టీ సాధిస్తుందన్నారు. తూర్పు గోదావరి జిల్లా దొంతమూరులో మహిళలు, పిల్లలపై జరిగిన దాడిని ఈ సందర్భంగా మురళీ మోహన్ ఖండించారు.

  • Loading...

More Telugu News