: ఆరుగురికి ఇస్తే... 600 మందికి ఇవ్వాలి: 1998 డీఎస్సీ కేసులో తెలంగాణ సీఎస్


1998లో జరిగిన డీఎస్సీ పరీక్షల్లో తమకు అన్యాయం జరిగిందని ఆరుగురు అభ్యర్థులు వేసిన పిటిషన్ పై సుప్రీంకోర్టులో నేడు వాదోపవాదాలు జరిగాయి. తెలంగాణ ప్రభుత్వం తరపున ప్రధాన కార్యదర్శి రాజీవ్ శర్మ విచారణకు హాజరయ్యారు. ఆరుగురికి ఉద్యోగం ఇస్తే మరో 600 మందికి ఇవ్వాల్సివస్తుందని సీఎస్ తెలిపారు. గతంలో సుప్రీం ఆదేశాలను రాష్ట్ర ప్రభుత్వాలు పట్టించుకోకపోవడంతో ప్రభుత్వాల తీరును న్యాయస్థానం కోర్టు ధిక్కారణగా పరిగణించింది. ఈ నేపథ్యంలో రాజీవ్ శర్మ కోర్టుకు హాజరయ్యారు. శర్మ వాదనను తప్పుబట్టిన కోర్టు కేసు తదుపరి విచారణను ఫిబ్రవరి 1కి వాయిదా వేసింది.

  • Loading...

More Telugu News