: పగటి కలలు వద్దు: చంద్రబాబుకు ఈటెల సలహా
2019లో తెలంగాణలో టీడీపీ అధికారంలోకి వస్తుందని చంద్రబాబు పగటి కలలు కంటున్నారని టీ-ఆర్థిక శాఖ మంత్రి ఈటెల రాజేందర్ ఎద్దేవా చేశారు. అధికారంలోకి రావడం అటుంచితే, అప్పటి వరకు ఇక్కడ ఆ పార్టీ బతికి బట్టకడితే కదా? అని ఆయన ప్రశ్నించారు. వరంగల్ లో ఓ పెళ్లి వేడుకకు హాజరైన ఆయన మాట్లాడుతూ, "చంద్రబాబు కలలు కల్లలయ్యే రోజు ఎంతో దూరంలో లేదు. ఇప్పటికే తెలంగాణలో ఆ పార్టీ కకావికలమైంది. ఆంధ్రలో పరిపాలన మరచి, తెలంగాణ అభివృద్ధిని బాబు ఏ విధంగా అడ్డుకోవాలని కుట్రలు చేస్తున్నాడో అందరికీ తెలుసు" అని విమర్శించారు.