: అమర జవాను చితికి నిప్పంటించిన ఎనిమిదేళ్ళ కుమార్తె
పాకిస్థాన్ ప్రేరేపిత ఉగ్రవాద దాడిలో మరణించిన లెఫ్టినెంట్ కల్నల్ సంకల్ప కుమార్ అంత్యక్రియలు పూర్తి అధికార లాంఛనాల మధ్య జరిగాయి. ఆయనకు కుమారులు లేకపోవడంతో ఎనిమిదేళ్ళ కుమార్తె సారా చితికి నిప్పంటించింది. ఆయన చేసిన త్యాగం భవిష్యత్ తరాలకు స్ఫూర్తిగా నిలవనుందని ప్రధాని మోదీ వ్యాఖ్యానించారు. నిన్న ఢిల్లీలో సంకల్ప కుమార్ మృతదేహం వద్ద ఆయన నివాళులు అర్పించారు. సంకల్ప కుమార్ అంత్యక్రియలకు కేంద్ర మంత్రులు ధర్మేంద్ర ప్రధాన్, జయంత్ సిన్హా, జార్ఖండ్ గవర్నర్ సయీద్ అహ్మద్, ముఖ్యమంత్రి హేమంత్ సోరెన్ తదితరులు పాల్గొన్నారు.