: అడిలైడ్ టెస్టుకు స్పోర్టింగ్ పిచ్ అంటున్న క్యూరేటర్


బోర్డర్-గవాస్కర్ ట్రోఫీలో భాగంగా తొలి టెస్టుకు రంగం సిద్ధమైంది. ఫిలిప్ హ్యూస్ మరణానంతరం ఆసీస్ జట్టు ఆడుతున్న తొలి మ్యాచ్ కావడంతో అడిలైడ్ లో రేపటి నుంచి జరిగే ఈ మ్యాచ్ పై సర్వత్ర ఆసక్తి నెలకొంది. ఈ సిరీస్ లో నెగ్గడమే హ్యూస్ కు తామిచ్చే నివాళి అన్న కోణంలో ఆసీస్, విదేశీ గడ్డపై పేలవ రికార్డును సవరించుకోవాలని భారత్ ఓవల్ బరిలో దిగుతున్నాయి. కాగా, సిరీస్ ఆరంభ మ్యాచ్ కు స్పోర్టింగ్ వికెట్ రూపొందించామని అడిలైడ్ ఓవల్ పిచ్ క్యూరేటర్ డామియన్ హౌ అంటున్నాడు. ఆరంభ ఓవర్లలో పేసర్లకు అనుకూలిస్తుందని, క్రమేణా బ్యాట్స్ మెన్ కు అనువుగా మారుతుందని వివరించాడు. స్పిన్నర్లకు కూడా 'టర్న్' లభ్యమవుతుందని చెప్పాడు. అయితే, రోజులు గడిచేకొద్దీ పిచ్ ఎలా స్పందించేది చెప్పలేమని అన్నాడు. మొత్తానికి పేస్ కే మొగ్గు ఉంటుందని తేల్చేశాడు.

  • Loading...

More Telugu News