: అక్రమ లే అవుట్ల నియంత్రణకు ఏపీ సర్కారు సన్నాహాలు


రాష్ట్రంలో రియల్ మాఫియాకు చెక్ పెట్టేందుకు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం రంగంలోకి దిగింది. రియల్ మాఫియాను నిలువరించే క్రమంలో ముందుగా అక్రమ లేఅవుట్లను నియంత్రించేందుకు సన్నాహాలు చేస్తోంది. ఇందులో భాగంగా కొద్దిసేపటి క్రితం ఏపీ సీఎం చంద్రబాబునాయుడు అధ్యక్షతన సమీక్షా సమావేశం ప్రారంభమైంది. అత్యంత ప్రాధాన్యమున్న ఈ సమావేశానికి డిప్యూటీ సీఎం, రెవెన్యూ శాఖ మంత్రి కేఈ కృష్ణమూర్తితో పాటు రెవెన్యూ శాఖ ఉన్నతాధికారులు కూడా హాజరయ్యారు. రాష్ట్రానికి కొత్తగా రాజధాని ఏర్పాటవుతున్న నేపథ్యంలో గుంటూరు, కృష్ణా జిల్లాల్లో అక్రమ లేఅవుట్లు వేలాదిగా వెలిశాయి. దీంతో పెద్ద ఎత్తున మోసాలు కూడా జరుగుతున్నాయి. ఈ క్రమంలో నేరాల సంఖ్య కూడా పెరిగిపోతోంది. ఈ విపరిణామాలన్నింటికీ కారణంగా నిలుస్తున్న అక్రమ లేఅవుట్లను నియంత్రిస్తే సరిపోతుందన్న యోచనలో సర్కారు నేడు తొలి అడుగేసింది. ఈ సమావేశంలో పలు కీలక నిర్ణయాలు వెలువడే అవకాశాలున్నాయి.

  • Loading...

More Telugu News