: టీమిండియా స్ఫూర్తితో ముందుకు సాగుదాం: సీఎంల సదస్సులో పీఎం మోదీ


దేశాభివృద్ధిలో కీలక భూమిక పోషించేందుకు ప్రణాళిక సంఘం స్థానంలో కొత్తగా రంగంలోకి దిగనున్న సంస్థ... టీమిండియా స్ఫూర్తితో ముందుకు సాగనుందని ప్రధాని నరేంద్ర మోదీ వెల్లడించారు. దేశాభివృద్ధి కోసం ప్రణాళికలను రూపొందించే సదరు సంస్థలో ఇకపై కేంద్రం ఆధిపత్యం ఉండబోదని ఆయన విస్పష్టంగా ప్రకటించారు. ప్రధాని-రాష్ట్రాల ముఖ్యమంత్రులు ఒక జట్టుగా, కేంద్ర కేబినెట్ రెండో జట్టుగా ఉంటే, ఈ రెండింటి మధ్య కేంద్ర-రాష్ట్రాల అధికారుల బృందం సమన్వయం చేయనుంది. ఆదివారం తన అధికారిక నివాసంలో ముఖ్యమంత్రులతో జరిగిన సమావేశంలో భాగంగా కొత్తగా రూపుదిద్దుకోనున్న సంస్థ విధి విధానాలపై సుహృద్భావ వాతావరణంలో చర్చ జరిగే దిశగా మోదీ విజయం సాధించారు. కొన్ని విధానపర అంశాలపై పలు రాష్ట్రాల సీఎంలు కేంద్రంతో విభేదించినా, ప్రణాళిక సంఘం స్థానంలో కొత్త సంస్థ ఆవశ్యకతను మాత్రం అంగీకరించారు. దీంతో ప్రణాళిక సంఘం రద్దు కోసం కేంద్రం వేసిన తొలి అడుగు దాదాపు విజయవంతమైందనే చెప్పాలి.

  • Loading...

More Telugu News