: మోదీ నివాసంలో పక్కపక్కనే బాబు, కేసీఆర్... భోజనాల వేళ మాటామంతీ!


ఏపీ, తెలంగాణ రాష్ట్రాల ముఖ్యమంత్రులు చంద్రబాబు నాయుడు, కేసీఆర్ తమ రాష్ట్ర ప్రయోజనాల పట్ల ఎంత కచ్చితంగా వ్యవహరిస్తారో తెలిసిందే. ఈ క్రమంలో ఒకరిపై ఒకరు విమర్శలు చేసుకుంటారు, సవాళ్లు విసురుకుంటారు! కవ్వింపులు, రెచ్చగొట్టే వ్యాఖ్యలు సర్వసాధారణం! అయితే, ప్రధాని నరేంద్ర మోదీ ఢిల్లీలోని తన నివాసంలో నిర్వహించిన ముఖ్యమంత్రుల సమావేశంలో వీరిద్దరూ ఎంతో ఒద్దిక ప్రదర్శించారు. పక్కపక్కనే కూర్చుని మోదీ చెప్పేది ఓపిగ్గా విన్నారు. అంతేనా, భోజనాల వేళ మాట్లాడుకుంటూ, అసలు, తాము ఏనాడూ పోట్లాడుకోలేదన్న రీతిలో చూపరులను ఆశ్చర్యపరిచారు. ఇక, సమావేశం సందర్భంగా తీయించుకున్న ఫొటోలో మాత్రం మోదీ పక్కన కేసీఆర్ నిలుచుండగా, చంద్రబాబు ఆయన వెనుక వరుసలో నిలుచున్నారు.

  • Loading...

More Telugu News