: ఈ సెక్యూరిటీ గార్డు ఒకప్పుడు ఎంపీపీ!


ప్రజాప్రతినిధులుగా పనిచేసిన కొందరు కోట్లకు పడగలెత్తి దర్జాగా బతుకుతుంటే, మరికొందరు దయనీయ స్థితిలో మనుగడ సాగిస్తున్నారు. వివరాల్లోకెళితే... వరంగల్ జిల్లా పర్వతగిరి మండలం వడ్లకొండకు చెందిన రంగయ్య 2006లో జరిగిన మండల పరిషత్ ఎన్నికల్లో గ్రామ ఎంపీటీసీగా టీడీపీ తరపున గెలిచాడు. ఎంపీపీ పదవి ఎస్సీ రిజర్వేషన్ కావడంతో రంగయ్య ఎంపీపీ అయ్యాడు. ఏడేళ్లపాటు నిస్వార్థంగా సేవలందించాడు. పదవి చేపట్టకముందు కూలీనాలీ చేసుకునేవాడు. ఎంపీపీ అయిన తర్వాత ప్రజల సేవ కోసమే పూర్తి సమయం కేటాయించాడు. గౌరవ వేతనమే అతని కుటుంబానికి అక్కరకొచ్చేది. స్వార్థ రహితంగా పనిచేసిన ఈ వ్యక్తి ఇప్పుడు ఓ సాధారణ సెక్యూరిటీ గార్డుగా బతుకీడుస్తుండడం బాధాకరం. ఎంపీపీ పదవీకాలం ముగిసిన తర్వాత ప్రభుత్వం ఆదుకోకపోవడంతో రంగయ్య ఉపాధి కోసం ఊరు విడిచాడు. ప్రస్తుతం అతడు ఢిల్లీ పబ్లిక్ స్కూల్ లో సెక్యూరిటీ గార్డుగా పనిచేస్తున్నాడు. క్షేత్రస్థాయి ప్రజాప్రతినిధులుగా పనిచేసిన వారికి కూడా ప్రభుత్వం నెలసరి వేతనం ఇచ్చి ఆదుకుంటే ఈ పరిస్థితి వచ్చి ఉండేది కాదేమో!

  • Loading...

More Telugu News