: భారత్ లో టెన్నిస్ దిగ్గజం రోజర్ ఫెదరర్


టెన్నిస్ ఆల్ టైం గ్రేట్ రోజర్ ఫెదరర్ భారత్ వచ్చాడు. అంతర్జాతీయ ప్రీమియర్ టెన్నిస్ లీగ్ (ఐటీపీఎల్)లో భాగంగా భారత్ తరఫున బరిలోకి దిగుతున్న ఫెదరర్ తొలిసారిగా భారత టెన్నిస్ కోర్టులపై ఆడనున్నాడు. భారత గడ్డపై తొలి మ్యాచ్ ఆడుతున్నందుకు సంతోషంగా ఉందని ఈ సందర్భంగా ఫెదరర్ వ్యాఖ్యానించాడు. భారత్ చేరుకున్న సందర్భాన్ని పురస్కరించుకుని టెన్నిస్ లో మునుపటి రారాజు పీట్ సాంప్రాస్ తో కలిసి తీసుకున్న ఫొటోను ఫెదరర్ తన ట్విట్టర్ అకౌంట్ లో పోస్ట్ చేశాడు. ఈ నెల 28న మొదలైన ఐటీపీఎల్ లో భాగంగా శనివారం నుంచి సోమవారం దాకా భారత్ లో మ్యాచ్ లు జరుగుతాయి. భారత జట్టు తరఫున రోజర్ ఫెదరర్ తో పాటు పీట్ సాంప్రాస్, గేల్ మోన్ ఫిల్స్, అన్నా ఇవనోవిక్, సానియా మీర్జా, రోహన్ బోపన్న ఆడుతున్నారు.

  • Loading...

More Telugu News