: చిరంజీవి కళ్లల్లో నీటి సుడులు... బొంగురుపోయిన గొంతు!


జానకీరామ్ భౌతికకాయాన్ని చూసి కేంద్ర మాజీ మంత్రి చిరంజీవి కంటతడిపెట్టారు. రోడ్డు ప్రమాదంలో మృత్యువాత పడిన జానకీరామ్ మృతదేహానికి కొద్దిసేపటి క్రితం చిరంజీవి నివాళులర్పించారు. ఈ సందర్భంగా జానకీరామ్ తండ్రి హరికృష్ణను ఓదార్చిన తర్వాత బయటకు వచ్చిన ఆయన విలేకరులతో మాట్లాడుతున్న సందర్భంగా దు:ఖాన్ని ఆపుకోలేకపోయారు. జానకీరామ్ మృతి దురదృష్టకరమని పేర్కొంటున్న సమయంలో చిరంజీవి కళ్లల్లో నీళ్లు తిరిగాయి. స్వరం బొంగురుపోయింది. అంతటి దు:ఖంలోనూ ఆయన, ప్రయాణాల్లో సీటు బెల్టు ప్రాధాన్యాన్ని వివరించారు. ప్రయాణాల్లో సీటు బెల్టు తప్పనిసరిగా ధరించాలని ఆయన ప్రజలకు పిలుపునిచ్చారు.

  • Loading...

More Telugu News