: సీఎంలతో ప్రధాని మోదీ సమావేశం ప్రారంభం
దేశంలోని అన్ని రాష్ట్రాల ముఖ్యమంత్రులతో ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ నిర్వహిస్తున్న సమావేశం కొద్దిసేపటి క్రితం ప్రారంభమైంది. ఢిల్లీలోని ప్రధాని అధికారిక నివాసంలో జరుగుతున్న ఈ భేటీకి ఏపీ, తెలంగాణ సీఎంలు నారా చంద్రబాబునాయుడు, కె.చంద్రశేఖరరావులతో పాటు దేశంలోని అన్ని రాష్ట్రాల ముఖ్యమంత్రులు హాజరయ్యారు. భేటీలో భాగంగా ప్రణాళిక సంఘం రద్దు, దాని స్థానంలో కొత్త కమిటీ ఏర్పాటు తదితరాలపై చర్చ జరుగుతోంది.