: హరికృష్ణను ఓదార్చిన బాలకృష్ణ


నందమూరి జానకీరామ్ మృతి నేపథ్యంలో బాలీవుడ్ అగ్ర నటుడు బాలకృష్ణ తన సోదరుడు, జానకీరామ్ తండ్రి హరికృష్ణను ఓదార్చారు. కొద్దిసేపటి క్రితం మాసాబ్ ట్యాంకులోని హరికృష్ణ నివాసానికి వెళ్లిన బాలకృష్ణ, జానకీరామ్ మృతదేహానికి నివాళులర్పించారు. అనంతరం ఆయన తన సోదరుడు హరికృష్ణను ఓదార్చారు. ఇదిలా ఉంటే జానకీరామ్ మృతి నేపథ్యంలో సినీ, రాజకీయ ప్రముఖులు పెద్ద సంఖ్యలో హరికృష్ణ నివాసానికి చేరుకుని ఆ కుటుంబాన్ని ఓదార్చుతున్నారు. దివంగత ఎన్టీఆర్ సతీమణి లక్ష్మీపార్వతి కూడా హరికృష్ణను ఓదార్చారు.

  • Loading...

More Telugu News