: జానకీరామ్ మృతికి జగన్ సంతాపం
టీడీపీ నేత హరికృష్ణ పెద్ద కొడుకు జానకీరామ్ మృతి పట్ల వైకాపా అధినేత వైఎస్ జగన్ మోహన్ రెడ్డి సంతాపం ప్రకటించారు. ఆదివారం మాసాబ్ ట్యాంకులోని హరికృష్ణ నివాసానికి వెళ్లిన జగన్, జానకీరామ్ మృతదేహానికి నివాళులర్పించారు. అనంతరం ఆయన హరికృష్ణ కుబుంట సభ్యులకు తన ప్రగాఢ సానుభూతి ప్రకటించారు. జగన్ వెంట ఆయన పార్టీ నేతలు పెద్ద సంఖ్యలో హరికృష్ణ నివాసానికి వెళ్లారు.