: చివరి నిమిషంలో జర్మనీ గోల్...ఛాంపియన్స్ ట్రోఫీలో భారత్ పరాజయం


మరో 34 సెకన్ల పాటు జర్మనీని నిలువరించి ఉంటే, హాకీలో ప్రపంచ ఛాంపియన్ ను నిలువరించామన్న ఆనందమైనా భారత హాకీ జట్టుకు లభించి ఉండేది. అయితే భారత్ చేసిన చిన్న పొరపాటును ఒడిసిపట్టిన జర్మనీ 34 సెకన్లలో మ్యాచ్ ముగుస్తుందనగా గోల్ చేసి, భారత జట్టు ఆనందంపై నీళ్లు చల్లింది. భువనేశ్వర్ లో శనివారం జరిగిన ఛాంపియన్ ట్రోఫీ మ్యాచ్ లో జర్మనీ చేతిలో 0-1 తేడాతో భారత్ ఓటమి చవిచూసింది. సొంతగడ్డపై అద్భుత ప్రదర్శన కనబరచిన భారత జట్టు జర్మనీని చివరి నిమిషం దాకా గోల్ చేయనీయకుండా నిలువరించింది. అయితే, ఆఖరి క్షణంలో జర్మనీ హాకీ స్టార్ ప్లోరియన్ పుచ్స్ గోల్ చేశాడు. దీంతో హాకీలో ప్రపంచ ఛాంపియన్ జర్మనీ చేతిలో భారత్ పరాజయం పాలైంది.

  • Loading...

More Telugu News