: 6,300 వ్యవసాయ విస్తరణ అధికారుల పోస్టుల భర్తీ: ప్రత్తిపాటి
ఆంధ్రప్రదేశ్ లో త్వరలోనే 6,300 వ్యవసాయ విస్తరణ అధికారుల ఉద్యోగాలను భర్తీ చేస్తామని వ్యవసాయ శాఖ మంత్రి ప్రత్తిపాటి పుల్లారావు తెలిపారు. గుంటూరులో ఆయన మాట్లాడుతూ, ఈ ఉద్యోగాల ప్రక్రియ కేవలం 45 రోజుల్లో పూర్తి చేయాలనుకుంటున్నామని అన్నారు. ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం వ్యవసాయానికి ప్రత్యేక ప్రాధాన్యత ఇస్తున్నందునే అనుబంధ శాఖల్లోని ఖాళీలను సాధ్యమైనంత త్వరలో భర్తీ చేయనున్నామని అన్నారు. ఈ సందర్భంగా లాం వ్యవసాయ పరిశోధన కేంద్రంలో ఏపీ టెక్-2014 ప్రదర్శనను ఆయన ప్రారంభించారు.