: 'పీకే' కుటుంబ చిత్రం అంటున్న అమీర్ ఖాన్


'థూమ్' సీక్వెల్ తరువాత నటుడు అమీర్ ఖాన్ నటించిన చిత్రం 'పీకే'. ఫస్ట్ లుక్ పోస్టర్, ట్రైలర్లతో ప్రేక్షకుల్లో ఊహాగానాలు పెంచిన ఈ సినిమా ఈనెల 19న విడుదల కాబోతోంది. ఈ చిత్రంలో అమీర్ గ్రహాంతరవాసిగా కనిపించనున్నాడు. అయితే 'పీకే' పూర్తి కుటుంబ చిత్రం అని మిస్టర్ పర్ ఫెక్షనిస్ట్ చెప్పాడు. దాని ప్రమోషన్ లో భాగంగా ఆస్ట్రేలియాలో ఏర్పాటు చేసిన వీడియో కాన్ఫరెన్స్ లో అమీర్ మాట్లాడుతూ, "ఇందులో హీరో సుశాంత్ సింగ్ రాజ్ పుత్ తో నాకెలాంటి సన్నివేశాలు లేవు. ఆ అవకాశం రాలేదు. ఇదొక కుటుంబ చిత్రం. సినిమాలో అభ్యంతరకరమైనదేమీలేదు. మా అమ్మ, పిల్లలు కూడా ఈ సినిమా చూశారు" అని చెప్పాడు. అంతేగాక పీకేలో యువ కథానాయిక అనుష్క శర్మ, సంజయ్ దత్ తో స్క్రీన్ పంచుకున్న అమీర్, అనుష్క ఓ అద్భుతమైన సహనటి అంటున్నాడు. తనతో నటిస్తున్నప్పుడు చాలా ఎంజాయ్ చేశానని చెప్పుకొచ్చాడు.

  • Loading...

More Telugu News