: విద్యుత్ ఉత్పత్తిని, ఉత్పాదకతను పెంచా: చంద్రబాబు
విద్యుత్ వ్యవస్థను కాంగ్రెస్ ప్రభుత్వం భ్రష్టుపట్టిస్తే, ఆ కష్టాలను పాదయాత్ర సందర్భంగా చూసి విద్యుత్ ఉత్పత్తిని, ఉత్పాదకతను పెంచానని ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు తెలిపారు. హైదరాబాదులో ఆయన మాట్లాడుతూ, నిరుపేదలను ఆదుకోవడమే తమ ప్రభుత్వ లక్ష్యమని అన్నారు. అందుకోసమే కేవలం 500 రూపాయలు వున్న వికలాంగుల పింఛనును 1500 రూపాయలకు పెంచానని ఆయన తెలిపారు.