: 15 ఏళ్లు దాటిన ముస్లిం అమ్మాయి పెళ్లి చేసుకోవచ్చు: గుజరాత్ హైకోర్టు


ఓ ముస్లిం అమ్మాయి యుక్త వయసు వచ్చిన తరువాత లేదా పదిహేనేళ్లు నిండిన తరువాత వివాహం చేసుకోవచ్చని గుజరాత్ హైకోర్టు పేర్కొంది. ఓ ముస్లిం యువకుడు తన కమ్యూనిటీకే చెందిన 17 ఏళ్ల అమ్మాయిని పెళ్లి చేసుకున్నాడన్న కారణంగా బాల్య వివాహ నిషేధ చట్టం కింద ఇటీవల ఓ పిటిషన్ దాఖలైంది. వివాహాన్ని నిరాకరించిన యువతి తల్లిదండ్రుల తరపున సూరత్ కు చెందిన 'గర్ల్స్ చిల్డ్రన్ హోం' ఆ పిటిషన్ వేసింది. దానిని పరిశీలించిన జస్టిస్ జేబీ.పర్దివాలా ధర్మాసనం, పిటిషన్ పై జరుగుతున్న న్యాయ విచారణను ఈ సందర్భంగా కొట్టివేసి, పైవిధంగా తీర్పు వెల్లడించింది. ముస్లిం చట్టం ప్రకారం, ఆ వర్గానికి చెందిన యువతి పదిహేనేళ్ళు దాటిన వెంటనే పెళ్లి చేసుకోవడానికి అర్హురాలిగా ప్రకటించింది. "ఇది ముస్లిం అబ్బాయి, అమ్మాయి మధ్య వివాదం కాదు. ఆ వయసు దాటిన తరువాత ఆమె తల్లిదండ్రుల అనుమతి లేకుండా కూడా వివాహం చేసుకోవచ్చు" అని ధర్మాసనం పేర్కొంది. మరోవైపు కోర్టు విచారణ సమయంలో సదరు యువతి తల్లిదండ్రులు, పెళ్లి చేసుకున్న అబ్బాయి, అమ్మాయి హాజరయ్యారు. పెళ్లి విషయాన్ని కోర్టుకు ధ్రువీకరించారు. అత్తవారింట్లో భర్తతో తాను సంతోషంగా ఉన్నానని యువతి కోర్టుకు తెలిపింది. అటు ఆమె తల్లిదండ్రులు కూడా వారి వివాహాన్ని న్యాయస్థానం ముందు అంగీకరించారు.

  • Loading...

More Telugu News