: 'బాయ్'పై ఫైర్ అయిన గుత్తా జ్వాల, అశ్విని
భారత బ్యాడ్మింటన్ సంఘం (బాయ్) 'డబుల్స్'పై వివక్ష చూపుతోందంటూ స్టార్ డబుల్స్ షట్లర్స్ గుత్తా జ్వాల, అశ్విని పొన్నప్ప మండిపడ్డారు. ఒలింపిక్స్ కు సమయం సమీపిస్తున్నా, ఇంతవరకు డబుల్స్ కు స్పెషలిస్ట్ కోచ్ ను నియమించలేదని ఆగ్రహం వ్యక్తం చేశారు. బాయ్ పై పూర్తిగా నమ్మకం కోల్పోయామని... శిక్షణ కోసం అన్ని సదుపాయాలున్న ఓ ఆసియా దేశానికి వెళ్లనున్నామని చెప్పారు. ఇకపై బాయ్ పై ఆధారపడదలుచుకోలేదని స్పష్టం చేశారు. ప్రపంచ ఛాంపియన్ షిప్ లో కాంస్య పతకం, కామన్వెల్త్ క్రీడల్లో రజత పతకాన్ని ఈ జోడీ సాధించింది.