: అక్షయ గోల్డ్ ఆస్తుల జప్తుకు ఉత్తర్వులు జారీ చేసిన ప్రభుత్వం
అక్షయగోల్డ్ ఆస్తుల జప్తుకు తదుపరి చర్యలు తీసుకోవాలని ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం సీఐడీకి ఉత్తర్వులు జారీ చేసింది. దీంతో అనంతపురం, కర్నూలు, ప్రకాశం, నెల్లూరు జిల్లాల్లోని 2,354 ఎకరాల భూమి, వివిధ బ్యాంకుల్లోని 10.15 కోట్ల రూపాయల నగదును జప్తు చేయనున్నారు. అలాగే అక్షయ గోల్డ్ కు చెందిన 26 మందిపై అభియోగ పత్రాలు నమోదు చేసేందుకు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం సీఐడీకి అనుమతి ఇచ్చింది.