: అలా అనేందుకు జగన్ అర్హుడేనా?: దేవినేని


విశాఖ జిల్లాలో ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వానికి వ్యతిరేకంగా చేపట్టిన ధర్నాలో వైఎస్సార్సీపీ అధినేత జగన్ వేసిన ప్రశ్నలపై మంత్రి దేవినేని ఉమామహేశ్వరరావు మండిపడ్డారు. హైదరాబాదులో ఆయన మాట్లాడుతూ, జగన్ కు ప్రభుత్వాన్ని విమర్శించే హక్కులేదన్నారు. పార్టీ నుంచి జారిపోతున్న నేతలను కాపాడుకునేందుకే జగన్ ధర్నా చేశారని ఆయన విమర్శించారు. హుదూద్ తుపాను టైంలో సహాయకచర్యలు అందలేదని ఆయన పేర్కొనడంపై మంత్రి దుమ్మెత్తిపోశారు. హుదూద్ సమయంలో 64 ఏళ్ల వయసులో ముఖ్యమంత్రి ఏం చేశారో విశాఖవాసులందరికీ తెలుసని ఆయన తెలిపారు. వైఎస్సార్సీపీ చేపట్టిన ధర్నాలో పార్టీ శ్రేణులు తప్ప రైతులు పాల్గొన్నారా? అని ఆయన ప్రశ్నించారు. 16 వేల కోట్ల రూపాయల లోటు బడ్జెట్ లో ఉండి కూడా రుణమాఫీ చేశామని ఆయన సూచించారు. తెలంగాణలో వైఎస్సార్సీపీ జెండా పీకేశారని, పార్టీ కార్యాలయం ఎక్కడుందో జగన్ చిరునామా చెప్పాలని ఆయన డిమాండ్ చేశారు. తెలంగాణ ముఖ్యమంత్రి ఆంధ్రవ్యతిరేక ప్రచారంపై జగన్ ఏనాడైనా ఒక్క మాట మాట్లాడారా? అని ఆయన ప్రశ్నించారు. రాష్ట్ర వ్యతిరేక వ్యాఖ్యలు, పనులు చేస్తున్నా కేసీఆర్ ను తప్పుపట్టే ధైర్యం జగన్ కు లేదని ఆయన విమర్శించారు.

  • Loading...

More Telugu News