: ఆ ప్రశ్నలకు గంటా సమాధానం చెప్పాలి: వైఎస్సార్సీపీ
ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ తీరుకు వ్యతిరేకంగా రాష్ట్ర వ్యాప్తంగా వైఎస్సీర్సీపీ చేపట్టిన ధర్నా విజయవంతం అయిందని ఆ పార్టీ అధికార ప్రతినిధి వాసిరెడ్డి పద్మ తెలిపారు. ముఖ్యమంత్రి చంద్రబాబు రుణమాఫీపై విధాన ప్రకటన చేసిన 24 గంటల్లోనే ధర్నా చేపడితే ప్రజలు బాగా స్పందించారని అన్నారు. దీనిని బట్టి చూస్తే ప్రభుత్వంపై ప్రజాగ్రహం ఏ స్థాయిలో ఉందో తెలిసిపోతుందని ఆమె అభిప్రాయపడ్డారు. విశాఖ జిల్లా వైఎస్సార్సీపీ అధ్యక్షుడు అమర్ నాథ్ వేసిన 24 ప్రశ్నలకు గంటా సమాధానం చెప్పాలని ఆమె డిమాండ్ చేశారు. వైఎస్సార్సీపీ చేపట్టిన ధర్నాలను విజయవంతం చేసిన ప్రజలకు ధన్యవాదాలని ఆమె తెలిపారు.