: 2019 నాటికి భారతీయులందరికీ 24 గంటల విద్యుత్: కేంద్రం


దేశంలో అందరికీ 2019 నాటికి 24 గంటల విద్యుత్ అందిస్తామన్న వాగ్దానాన్ని కేంద్ర ప్రభుత్వం పునరుద్ఘాటించింది. ఆ లక్ష్యాన్ని సాధించేందుకు ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ బాగా ఉపయోగపడుతుందని కేంద్ర విద్యుత్ శాఖ మంత్రి పియూష్ గోయెల్ చెప్పారు. ఢిల్లీలో 'డిజిటల్ ఇండియా కాంక్లేవ్-2014' సదస్సులో మంత్రి మాట్లాడుతూ, "ఐటీ ఆధారిత స్మార్ట్ గ్రిడ్లు ఇంధన రంగంలో అద్భుతమైన ప్రభావం చూపుతాయి. విద్యుత్ ఉత్పత్తిలో గానీ, వాడకంలో గానీ ఈ ప్రభావం కనిపిస్తుంది. ఈ దిశగా, 2019 నాటికల్లా భారతీయులందరికీ నిరంతర విద్యుత్ అందేలా చూస్తాం" అని వివరించారు. కాగా, సీసీటీవీ కెమెరాలను ఉపయోగించడం ద్వారా బొగ్గు చౌర్యాన్ని నిరోధించడానికి ప్రభుత్వం కట్టుబడి ఉందని చెప్పారు.

  • Loading...

More Telugu News