: ఎస్సీ, ఎస్టీ సబ్ ప్లాన్ కు మరిన్ని నిధులు కేటాయిస్తాం: మంత్రి రావెల


ఎస్సీ, ఎస్టీ సబ్ ప్లాన్ కు మరిన్ని నిధులు కేటాయించేందుకు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం సిద్ధంగా ఉందని మంత్రి రావెల కిషోర్ బాబు తెలిపారు. హైదరాబాదులో ఆయన మాట్లాడుతూ, ఎస్సీ, ఎస్టీ సబ్ ప్లాన్ నిధుల ఖర్చుపై తాము నోడల్ ఏజెన్సీతో చర్చించినట్టు చెప్పారు. అంబేద్కర్ వర్ధంతి సందర్భంగా ప్రభుత్వం కొత్త పథకాలు ప్రవేశపెట్టడానికి సిద్ధంగా ఉన్నట్టు వెల్లడించారు. ఈ మేరకు ప్రభుత్వం ప్రణాళికలు రచిస్తోందని ఆయన వివరించారు. ఎస్సీ,ఎస్టీ విద్యార్థుల్లో వృత్తినైపుణ్యం పెంపొందేలా చర్యలు తీసుకుంటామని ఆయన తెలిపారు.

  • Loading...

More Telugu News