: ఎల్టీటీఈ తీసుకున్న బంగారు నగలను వెనక్కి ఇచ్చేసిన రాజపక్స


శ్రీలంకలో సమాంతర పాలన నడిపిన కాలంలో ఎల్టీటీఈ ప్రజల నుంచి పెద్ద ఎత్తున బంగారం, ఇతర ఆభరణాలను తీసుకుంది. ఎల్టీటీఈని లంక సైన్యం తుదముట్టించడంతో అవన్నీ ప్రభుత్వపరం అయ్యాయి. తాజాగా, శ్రీలంక అధ్యక్షుడు మహింద రాజపక్స ఆ నగలన్నింటినీ స్వయంగా ఉత్తర ప్రాంత ప్రజలకు ఇచ్చేశారు. జాఫ్నా ప్రాంతంలో ఓ దశలో ఎల్టీటీఈ ప్రభుత్వానికి సమాంతరంగా పాలన నిర్వహించింది. ఆ సమయంలో విలువైన ఆభరణాలను ప్రజల నుంచి బలవంతంగా లాగేసుకున్నారని, లేక, ప్రజలే ఎల్టీటీఈకి అప్పగించారని కొన్ని వాదనలు ఉన్నాయి. కీలకమైన అధ్యక్ష ఎన్నికలు సమీపిస్తుండడంతో రాజపక్స దృష్టి తమిళులపై పడింది. వారి ఓట్లను రాబట్టే క్రమంలోనే ఈ ఆభరణాలను తిరిగి ఇచ్చేసినట్టుగా కనిపిస్తోంది. ఉత్తరప్రాంత తమిళులను తన నివాసానికి ఆహ్వానించి మరీ, నగలను ఇచ్చారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, బంగారం కంటే విలువైన 'స్వేచ్ఛ'ను ప్రసాదించానని పేర్కొన్నారు.

  • Loading...

More Telugu News