: నోటికి నల్లగుడ్డ కట్టుకుని రాహుల్ మౌనదీక్ష


ఎన్నికల్లో ఓటమి సిద్ధిస్తే గానీ కాంగ్రెస్ పార్టీ ఉపాధ్యక్షుడు రాహుల్ గాంధీకి పరిస్థితి అర్థమైనట్టు లేదు! మొన్నటిదాకా సీటుకే అతుక్కుపోయిన ఆయనకు ప్రతిపక్షంలో కూర్చునేసరికి పోరుబాట ప్రాధాన్యం తెలిసొచ్చినట్లుంది. నిన్నటికి నిన్న నరేంద్ర మోదీ సర్కారు ఉదాసీన వైఖరిపై పార్లమెంట్ ఆవరణలో పార్టీ ఎంపీలతో కలసి నిరసన చేపట్టిన రాహుల్, తాజాగా కేంద్ర మంత్రి సాధ్వి నిరంజన్ జ్యోతి వ్యాఖ్యలపై శుక్రవారం వినూత్న ఆందోళనకు దిగారు. నోటికి నల్లగుడ్డ కట్టుకుని ఆయన పార్లమెంట్ ఆవరణలో మౌనదీక్ష చేపట్టారు. సభలో విపక్షాల గొంతు నొక్కేలా సర్కారు వ్యవహరిస్తోందన్న విషయాన్ని సింబాలిక్ గా చెప్పేందుకే ఆయన ఈ తరహా నిరసన చేపట్టారు.

  • Loading...

More Telugu News